షాకింగ్: సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్

Share Icons:
బాలీవుడు నటుడు రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతోన్న సంజయ్‌ను సన్నిహితులు వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు కరోనా వైరస్ సోకిందేమోనని పరీక్షలు చేశారు. అయితే, నెగిటివ్ అని వచ్చింది. కానీ, వైద్యులు సంజయ్‌కు అన్ని రకాల టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్స్ మంగళవారం వచ్చాయి. ఈ పరీక్షల్లో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. అది కూడా స్టేజ్ 3లో ఉందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సంజయ్ దత్ వయసు 61 సంవత్సరాలు.

సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలినట్టు ఆయన సన్నిహితులు బాలీవుడ్ హంగామా ఛానెల్‌కు చెప్పారు. త్వరలోనే ఆయన చికిత్స నిమిత్తం యూఎస్‌కు వెళ్తారని అన్నారు. సంజయ్ ఆప్త మిత్రుడు ఒకాయన బాలీవుడ్ హంగామాతో మాట్లాడుతూ.. ‘‘బాబా కూలబడిపోయారు. ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు, వారు ప్రస్తుతం దుబాయిలో తల్లి వద్ద ఉన్నారు. కానీ, వారికి ఈ భయంకరమైన విషయాన్ని చెప్పడం ఒక అగ్ని పరీక్ష’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:

అయితే, సంజయ్ దత్‌కు వచ్చిన క్యాన్సర్ నయం కావడానికి అకాశాలు ఉన్నాయని ఆయన మిత్రుడు వెల్లడించారు. అయితే, చికిత్స కోసం తక్షణమే ఆయన యూఎస్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, సంజయ్ దత్ కూడా మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చికిత్స నిమిత్తం తాను సినిమా షూటింగ్‌ల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన కుటుంబం, స్నేహితులు తనకు తోడుగా ఉన్నారని, తన శ్రేయోభిలాషులు ఎలాంటి కంగారు పడొద్దని ఆయన చెప్పారు. అభిమానుల ప్రేమ, దీవెనలతో త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు. అయితే, తనకు క్యాన్సర్ ఉన్నట్టు మాత్రం ఆయన వెల్లడించలేదు.