షాకింగ్.. వనిత విజయ్ కుమార్‌పై మరో కేసు.. మూడో పెళ్లి తర్వాత వరుస వివాదాల్లో హీరోయిన్!

Share Icons:
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వనిత మూడో భర్తగా పీటర్ పాల్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడంతో అంతా షాకయ్యారు. తనకు విడాకులు ఇవ్వకుండానే
తన భర్త పీటర్ పాల్.. వనితను పెళ్లి చేసుకున్నాడంటూ పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ కేసు పెట్టింది. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగకుండా వనిత విజయ్ కుమార్‌పై వరుసపెట్టి పోలీస్ కేసులు నమోదవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వనిత మూడో పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ కావడంతో పలు మీడియా ఛానెల్స్ ఆమెతో చర్చా వేదికలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వనిత.. సినీ నటి,దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింద. నీకు ఒక్క భర్త ఉంటే మాత్రం ఏమన్నా పతివ్రతావా అంటూ ఆమెపై రెచ్చిపోయింది. దీంతో వనితపై పోలీస్ కేసు పెట్టింది లక్ష్మీ రామకృష్ణన్.

Also Read:
ఇలా ఇప్పటికే వనితపై రెండు పోలీస్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ ఇష్యూగా మారింది. కరోనా సమయంలో ఎక్కువమంది జనాలను పిలిచి వేడుక చేసుకోవడంతో పాటు అడిగితే దురుసుగా వ్యవహరిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. దీంతో మూడో పెళ్లి తర్వాత వనిత విజయ్ కుమార్ వ్యవరిస్తున్న తీరుపై జనాల్లో చర్చలు ముదిరాయి. మరోవైపు వనిత విజయ్ కుమార్- లక్ష్మీ రామకృష్ణన్‌ల మధ్య చెలరేగిన వివాదం మరింత ముదిరింది.