షాకింగ్.. మరో సినీ నటికి కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా అభిమానులకు రిక్వెస్ట్

Share Icons:
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు లక్షలు దాటుతుండటం ప్రజల్లో భాయాందోళనలు రేకెత్తిస్తోంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా మహమ్మారి వెంటాడుతుండటం, గత కొంతకాలంగా పలువురు నటీనటులు కరోనా బారిన పడుతుండటం కలవరపెడుతోంది. నిన్న (జులై 12) బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాలకు అని వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సినీ లోకం తాజాగా మరో బాలీవుడ్ నటికి కరోనా సోకిందని తెలియడంతో మరింత ఆందోళనలో పడింది.

బాలీవుడ్ నటి రాచెల్ వైట్‌కి కరోనా సోకింది. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కోల్‌కతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉంటున్న ఆమె.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త‌న‌ ఆరోగ్యం మెరుగుప‌డాల‌ని అభిమానులు ప్రార్థ‌న‌లు చేయాల‌ని కోరింది. రాచెల్ వైట్ చేసిన ఈ ట్వీట్ చూసి.. ‘‘పానిక్ కావొద్దు, భయపడాల్సిన పనిలేదు’’ అంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read:
కంగనా రనౌత్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఉంగ్లీ సినిమాలో రాచెల్ వైట్ నటించింది. అలాగే బెంగాలీ చిత్రం ‘హర్ హర్ బ్యోమ్‌కేష్’‌లో కూడా ఆమె కీలకపాత్ర పోషించింది.