షాకింగ్: కంగనాపై దేశ ద్రోహం కేసు.. ముంబై పోలీసులను బాబర్స్ అనడంపై ఫైర్!

Share Icons:
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై నమోదైంది. యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై కంగనా ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మురికితో పేరుకుపోయిందని, బాలీవుడ్‌లో డ్రగ్స్ కంపు లేని పార్టీ ఒక్కటి కూడా ఉండదనే ఆరోపణలు గుప్పించిన ఆమె.. సుశాంత్ కేసు విషయమై మహారాష్ట్ర సర్కారుతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరు పెట్టుకుంది. ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌గా పోల్చుతూ కామెంట్స్ చేయడంతో రచ్చ మొదలై చాలా దూరం వెళ్లింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తీరును తప్పుబడుతూ ఓ కాస్టింగ్ డైరెక్టర్ కోర్టుకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనా చేస్తున్న ట్వీట్స్, ఇస్తున్న ఇంటర్వూస్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ముంబై పోలీసులను బాబర్స్ అని ఆమె పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఫిర్యాదు పరిశీలించి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించడంతో ముంబై పోలీసులు వారిద్దరిపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read:
దీంతో ఇప్పటికే ముంబై నగరంపై, మహారాష్ట్ర రాష్ట్ర పోలీసుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్న కంగనా రనౌత్.. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతుందనేది జనాల్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందో!.