షమీ తెలివి.. బుట్టలో పడిన డేవిడ్ వార్నర్

Share Icons:
ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్‌కి ఆరంభంలోనే వికెట్ దక్కింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3: 7 బంతుల్లో)‌ని బోల్తా కొట్టించాడు. షార్ట్ పిచ్ రూపంలో వరుసగా షమీ రెండు బంతులు విసరగా.. తొలి బంతిని అతికష్టం మీద అడ్డుకున్న వార్నర్.. రెండో బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. మొదటి బంతిని ఆడటంలో వార్నర్ బలహీనతని పసిగట్టిన షమీ.. రెండో బంతినీ అదే తరహాలో సంధించి వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.


రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆఫ్ స్టంప్‌ లైన్‌పై షమీ విసిరిన బంతిని పాయింట్, కవర్స్ మధ్యలో హిట్ చేసేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్.. మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. దీంతో.. బెంగళూరు వన్డేలో డేవిడ్ వార్నర్ కాస్త జాగ్రత్తగా షమీని ఎదుర్కొంటూ కనిపించాడు. కానీ.. ఎట్టకేలకి షమీ అతడ్ని బుట్టలో వేయగలిగాడు.

షార్ట్ పిచ్ రూపంలో శరీరానికి అతి సమీపంగా వెళ్తున్న బంతిని డేవిడ్ వార్నర్ కొద్దిగా వెనక్కి వంగి పాయింట్ దిశగా కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఆ బంతిని ఎందుకు టచ్ చేశానా..? అనే తరహాలో తనని తాను నిందించికుంటూ డేవిడ్ వార్నర్ పెవిలియన్‌కి వెళ్లాడు.

Read More: