శ్రీశాంత్ ఈజీ క్యాచ్‌లు వదిలేశాడు.. కానీ..? : రాబిన్ ఊతప్ప

Share Icons:
దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన ఫస్ట్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పేలవ ఫీల్డింగ్‌తో టీమ్‌లో కంగారు పెంచాడని అప్పటి అతని సహచర క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా వెలుగులోకి తెచ్చాడు. ఆ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన టీమిండియా.. గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో.. ఎలాంటి అంచనాల్లేకుండా టీ20 వరల్డ్‌కప్‌కి వెళ్లిన భారత్ జట్టు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా విజేతగా నిలిచింది.

Read More:

జొహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయానికి చివరి 4 బంతుల్లో 6 పరుగులు అవసరమవగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. దాంతో.. ధోనీ డైరెక్షన్‌లో జోగీందర్ శర్మ తెలివిగా ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో చివరి ఓవర్ మూడో బంతికి సిక్స్ బాదాలని ఆశించిన మిస్బావుల్ హక్ స్కూప్ షాట్ ఆడాడు. కానీ.. గాల్లోకి లేచిన బంతి ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ చేతుల్లో పడింది. దాంతో.. 5 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

Read More:

వాస్తవానికి ఫైనల్ మ్యాచ్‌లో ఆ మిస్బావుల్ హక్ క్యాచ్‌ని శ్రీశాంత్ పట్టుకుంటాడనే నమ్మకం ఆ టైమ్‌లో తనకి లేకపోయిందని తాజాగా రాబిన్ ఊతప్ప వెల్లడించాడు. ‘‘మిస్బా స్కూప్ షాట్ ఆడగానే.. ఆ బంతి గాల్లోకి ఎక్కువ హైట్‌ లేచింది. దాంతో.. ఫైన్ లెగ్‌లో ఫీల్డర్ ఎవరున్నారా..? అని చూశా. అక్కడ శ్రీశాంత్ ఉండటంతో నాలో కంగారు మొదలైంది. ఎందుకంటే.. ఆ టోర్నీలో చాలా సులువైన క్యాచ్‌ల్ని అతను జారవిడిచాడు. అందుకే.. ఆ క్యాచ్‌ని పట్టాలని దేవుడ్ని ప్రార్థిస్తూ బౌండరీ లైన్ నుంచి వికెట్స్‌ వైపు పరుగెత్తాను. లక్కీగా అతను క్యాచ్ పట్టేశాడు. దాంతో.. కొన్ని క్షణాల నమ్మలేకపోయా’’ అని రాబిన్ ఊతప్ప వెల్లడించాడు.