శ్రీదేవి తైస్ చూసే ఆమెకు బిగ్ ఫ్యాన్ అయ్యా: రామ్ గోపాల్ వర్మ

Share Icons:
పేరు చెబితే చాలు మనకు సంచలనం, వివాదాస్పదం, వెటకారం వంటి పదాలు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తీరు ఇలానే ఉంది మరి. ఎవ్వరి మాటా వినడు సీతయ్య అన్నట్టుగా వర్మ కూడా ఎవ్వరినీ పట్టించుకోరు. తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. వివాదాలను కూడా లెక్కచేయరు. అందుకే గట్స్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో దర్శక, నిర్మాతలంతా ఏం చేయాలని ఆలోచిస్తుంటే.. వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు.

ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో దానిని తలదన్నే ఏటీటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ వాటిని ఏటీటీలో విడుదల చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. మియా మాల్కోవా ‘క్లైమాక్స్’తో తన లాక్‌డౌన్ బిజినెస్‌ను మొదలుపెట్టిన వర్మ.. ‘నగ్నం’ (NAKED)తో సంచలనం సృష్టించారు. దేశీ బ్యూటీతో అందాలు ఆరబోయించి ఆ తరహా సినిమాలు చూసే వారిని తనవైపు తిప్పుకున్నారు. ఏడాదికి రూ.350 పెట్టి ఓటీటీ ప్లాట్‌ఫాంను సబ్‌స్క్రైబ్ చేసుకునే ఈ రోజుల్లో ఒక్క సినిమాకు రూ.200 చార్జ్ చేశారు. అయినప్పటికీ జనం ఎగబడ్డారు. 20 గంటల్లోనే రూ.70 లక్షలకు పైగా వసూలైంది.

Also Read:

అయితే, ‘నగ్నం’ సినిమా గురించి మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మను ‘సమయం’ సంప్రదించింది. ఆయనతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ‘నగ్నం’ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని ఆర్జీవీ చెప్పారు. ఎరోటిక్ (శృంగారం) జోనర్‌కు క్రైమ్ థ్రిల్లర్‌ను జతచేసి ‘నగ్నం’ తీశామన్నారు. ‘నగ్నం’ అనేది చాలా బలమైన పదమని.. నగ్నం అంటే భౌతికంగా మాత్రమే కాదని, అంతర్గతంగా ఉండే భావమని అన్నారు. అయితే, ఈ సినిమా అంతర్గత నగ్నతకు సంబంధించినది అయినప్పుడు బాహ్య నగ్నత చూపించడం అవసరమా అని ఆర్జీవీని ‘సమయం’ అడిగింది. దీనికి వర్మ అవుననే సమాధానం ఇచ్చారు. ఈ సినిమాను శృంగారభరితంగా తీశాం కాబట్టి బాహ్య నగ్నత చూపించాల్సి ఉంటుందన్నారు.

కాగా, రేపిడ్ ఫైర్‌లో భాగంగా ఆర్జీవీ చెప్పిన కొన్ని సమాధానాలు ఆసక్తికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జీవీ అభిమాన నటి శ్రీదేవి ప్రస్తావన ఆసక్తికరం. ‘మీరు అకస్మాత్తుగా శ్రీదేవిలా మారిపోతే మీరు ఎలా ఫీలవుతారు’ అన్న ప్రశ్నకు ఆర్జీవీ తన స్టైల్లో సమాధానం చెప్పారు. ‘‘నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే, శ్రీదేవి గారి తైస్ చూడగలను కానీ.. నా తైస్ నేను చూసుకోలేను. ప్రధానంగా శ్రీదేవి తైస్ చూసే నేను ఆమెకు బిగ్ ఫ్యాన్ అయ్యాను’’ అని సమాధానం ఇచ్చారు. ఇక ఆర్జీవీ, బాలయ్య ఇద్దరిలో మంచి సింగర్ ఎవరంటే బాలయ్య అని సమాధానం ఇచ్చారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ వీడియో