శ్రావణి సూసైడ్‌తో నాకేం సంబంధం లేదు: నిర్మాత అశోక్‌రెడ్డి

Share Icons:
బుల్లితెర నటి కొండపల్లి కేసులో సినీ నిర్మాత పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్న పోలీసులు తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. అయితే శ్రావణి ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అశోక్‌రెడ్డి చెబుతున్నారు. శ్రావణిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, తాను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడలేదని పేర్కొన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని అశోక్‌రెడ్డి తెలిపారు.


అశోక్‌రెడ్డికి ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఎస్సార్‌ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రావణిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఆమెతో ఎలాంటి పరిచయం ఉంది, సాయి కృష్ణారెడ్డితో కలిసి ఆమెను ఏమని బెదిరించారు, శ్రావణిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత సాయితో కలిసి ఎందుకు వేధించారు.. అన్న ప్రశ్నలకు అశోక్‌రెడ్డి నుంచి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read:

విచారణ పూర్తయిన అశోక్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టి అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏ1 దేవరాజ్‌రెడ్డి, ఏ2 సాయికృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Also Read: