శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: స్టార్ జంటకు పోలీసులిచ్చిన పోలీసులు

Share Icons:
బాలీవుడ్‌, శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ కావడంతో దక్షిణ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. కస్టడీలో వీరిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. వారిద్దరు ప్రముఖుల పేర్లను వెల్లడించడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది.

Also Read:

ఈ క్రమంలోనే కన్నడ స్టార్ జంట దింగత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు సీసీబీ ఆఫీసులో తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలో నిర్వహిస్తున్న ఐ బార్టనే అనే క్యాసినోలో ఈ జంట సందడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో డ్రగ్స్ సరఫరా చేసేవారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read:

డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపైన కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్టులో మంగళవారం సీసీబీ పోలీసులు తనిఖీలు చేశారు. ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: