‘వి’ రిజల్ట్‌తో నాని భయపడుతున్నాడా?

Share Icons:
నేచురల్ స్టార్ , సుధీర్‌బాబు మల్టీస్టారర్‌లో ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ‘వి’ సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నానితో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగుకు సంబంధించి ఓటీటీ ద్వారా విడుదలైన పెద్ద సినిమా ఇదే కావడంతో టాలీవుడ్ సైతం దీని ఫలితంపై ఆసక్తి చూపారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ చిత్రం లేకపోవడంతో అందరిని నిరాశ పరిచింది. దీంతో ఓటీటీ ద్వారా సినిమాలను రిలీజ్ చేద్దామనుకున్న వారంతా సైలెంట్ అయిపోయారు.

Also Read:

ఈ సినిమా ఫలితంతో నాని తన తదుపరి ప్రాజెక్ట్స్‌ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ‘’లో నటిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఏదో సాధారణ సినిమాగా కాకుండా ఏదైనా స్పెషల్‌ ఎలిమెంట్స్ౠ జోడించాలని నాని డైరెక్టర్‌ని కోరినట్లు తెలుస్తోంది. ఒకే మూసలో సినిమాలు తీస్తున్నాడని తనపై వస్తున్న విమర్శలను ఈ సినిమాతో పటాపంచలు చేయాలని నాని అనుకుంటున్నాడట. దీనికి తోడు ‘వి’ సినిమాలో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: