విరాట్ కోహ్లీ మళ్లీ బోల్తా.. రికార్డుల్లోకి ఆసీస్ స్పిన్నర్

Share Icons:
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జూలు విదిల్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 340/6 చేసింది. అయితే భారత కెప్టెన్ మరోసారి చేతిలో ఔటవడం విశేషం.

Read Also :
ముంబైలో జరిగిన తొలి వన్డేలో మంచి జోరు మీదున్న కోహ్లీని ఔట్ చేసిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. రాజ్‌కోట్ వన్డేలోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. అంతకుముందు సొగసరి ఆఫ్ సెంచరీ (78)తో సత్తాచాటిన కోహ్లీ.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లీ క్యాచ్‌ను ఇద్దరు ప్లేయర్లు పూర్తి చేయడం విశేషం. తొలుత బౌండరీలైన్ వద్ద క్యాచ్ అందుకున్న ఆష్టన్ ఆగర్.. బంతిని మిషెల్ స్టార్క్ అందించడంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే కోహ్లీని ఔట్ చేయడం ద్వారా జంపా రికార్డుల్లోకి ఎక్కాడు.

Read Also :
వన్డేల్లో కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా ఉమ్మడిగా రెండోస్థానంలో జంపా నిలిచాడు. గతంలో శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ .. కోహ్లీని ఐదుసార్లు ఔట్ చేశారు. తాజాగా జంపా వీరిద్దరి సరసన చేరాడు. అయితే వెస్టిండీస్ పేసర్ రవి రాంపాల్ అత్యధికంగా ఆరుసార్లు కోహ్లీని ఔట్ చేసి ఈ లిస్టులో అందరికంటే ముందున్నాడు. ఓవరాల్‌గా కోహ్లీకి 11 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన జంపా.. అతణ్ని ఐదుసార్లు ఔట్ చేయడం విశేషం.

Read Also :