విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్.. సౌత్‌లో ఏకైక హీరో

Share Icons:
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర భాషల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. దీనికి తోడు స్టైలింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇతర హీరోలతో పోలిస్తే ట్రెండీగా ఉంటుంది. అందుకే, సోషల్ మీడియాలో సైతం విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే రికార్డ్ సృష్టించేటంత.

ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ ఫాలోవర్లు 8 మిలియన్ దాటారు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఏ సినీ నటుడికి ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఏకైక సౌత్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్లను సంపాదించారని ఫ్యాన్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ చేస్తున్నారు. కాగా, విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో 1.7 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. ఫేస్‌బుక్‌లో 3.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 1.3 మిలియన్ మంది లైక్ చేశారు.

Also Read:

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ 10వ సినిమా ఇది. ఈ సినిమా కోసం విజయ్ థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. లాక్‌డౌన్ ముందు వరకు ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పీసీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.