వర్మకు ‘పవర్’ఫుల్ వార్నింగ్: ‘పవర్ స్టార్’లో అంతా పాజిటివే!!

Share Icons:
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ను కరెక్ట్‌గా ఉపయోగించుకున్న మూవీ మేకర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మే. వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ సీనియర్ దర్శకుడు.. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో తన ఫ్యాక్టరీ నుంచి ఒక్కో ఐటమ్‌ను బయటికి తీసుకొస్తున్నారు. వాటితో డబ్బులు చేసుకుంటున్నారు. చిన్న చిన్న సినిమాలు తీసి పే పర్ వ్యూ మోడల్‌లో ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలతో భారీ మొత్తంలో కలెక్షన్ రాబట్టారు.

తన ప్లాన్ సక్సెస్ కావడంతో వర్మ మరిన్ని లఘు చిత్రాలను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి కొడితే కుంభస్థలం బద్ధలైపోవాలనే ఆలోచనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో ఆయన వైఫల్యాన్ని కాస్త వెటకారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులతో ఓ 30 నిమిషాల సినిమాను తీసేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను వర్మ ట్విట్టర్ ద్వారా వదిలారు. ఇవి చూసి నవ్వుకున్నవాళ్లు నవ్వుకున్నారు.. తిట్టుకున్నవాళ్లు తిట్టుకున్నారు.

Also Read:

అయితే, పవన్ కళ్యాణ్‌‌పై వెటకారంగా, విమర్శనాత్మకంగా సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడం వర్మకు అంత సులభంకాదు అనే వాదన ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. నిజానికి వర్మకు ఇప్పటికే పవన్ వర్గం నుంచి వార్నింగ్‌లు వెళ్లిపోయాయని అంటున్నారు. ‘రక్తచరిత్ర’ సినిమాను ప్రకటించినప్పుడు రాయలసీమకు చెందిన ఒక బడా నేత కొడుకు నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయని అప్పట్లో రూమర్లు నడిచాయి. తన తండ్రి గురించి తప్పుగా చూపిస్తే తాట ఒలిచేస్తానని వర్మను అప్పట్లో బెదిరించారట.

దీంతో మనకెందుకు వచ్చిన గొడవలే అని ‘రక్తచరిత్ర 2’లో ఆ పెద్దాయన పాత్రను వర్మ పాజిటివ్‌గా మలిచారని అంటుంటారు. అంతేకాదు, ఈ రెండో భాగంలో స్లో మోషన్ వీడియోలు పెట్టి సినిమా నిడివిని కూడా పెంచారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు అలాంటి వార్నింగే మళ్లీ వర్మకు వచ్చిందని గుసగుసలు. వైపు నుంచి ఓ బడా నేత వర్మకు హెచ్చరికలు జారీ చేశారట. ఇది వర్మ ‘పవర్ స్టార్’ సినిమా ప్రకటించినప్పుడే జరిగిందని అంటున్నారు.

Also Read:

ఈ చిన్న సినిమాలో వర్మ ఎట్టిపరిస్థితుల్లో పవర్ స్టార్‌ను తక్కువ చేసి చూపించరట. ఇతర పొలిటికల్ లీడర్స్‌పై మాత్రం సెటైర్లు ఉంటాయని టాక్. కాకపోతే, ఈ విషయం బయటపడితే ఎవరూ ఈ సినిమాను చూడరని.. అందుకే తన స్టైల్లో వివాదాస్పద పోస్టర్లతో ‘పవర్ స్టార్’ను వర్మ ప్రచారం చేసుకుంటున్నారని ఇండస్ట్రీల వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో ‘పవర్ స్టార్’ వచ్చేంత వరకు ఆగాల్సిందే.