వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్: తొలిరోజు సిక్స్ కొట్టిన విజయ్ దేవరకొండ

Share Icons:
క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, కేథరీన్ త్రెసా, ఇజబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అయింది. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ చూస్తే తొలిరోజు బాగానే బోనీ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1150 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఆక్యుపెన్సీ రేట్ 70.19 శాతం ఉందట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయింది. ఇకపోతే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమానే తన చివరి ప్రేమ కథా చిత్రం అని విజయ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక నుంచి లవ్ స్టోరీలు చేయనని చెప్పాడు. ‘‘నా సినిమాకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక కొత్త అనుభూతిని పొందాలనే సినిమాలు చేస్తుంటా.. ఈ సింగిల్ డబుల్స్ కొట్టడం మన వల్ల కాదు.. కొడ్తే సిక్సే.. ప్రతి బాల్‌ని బౌండరీ బాదాలనే చూస్తా.

READ ALSO:

ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో బంతిని గట్టిగానే కొట్టా.. బంతి గాల్లో ఉంది.. మరి అది బౌండరీ బయటపడిందో.. క్యాచ్ ఔట్ అయ్యిందో సినిమా చూసి చెప్పాలి’ అని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ విషయానికొస్తే సినిమాలో క్రెడిట్ మొత్తం ఐశ్వర్య రాజేష్ పెర్ఫామెన్స్‌కి దక్కింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశీ ఖన్నానే అయినప్పటికీ.. సువర్ణ పాత్రలో ఐశ్వర్య ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది.

READ ALSO: