వరల్డ్‌కప్‌ తర్వాత టీ20లకి కోహ్లీ గుడ్‌ బై..?

Share Icons:
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? టీమిండియా బిజీ షెడ్యూల్‌పై ఇటీవల పెదవి విరిచిన కోహ్లీ 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు ఫార్మాట్లలో మాత్రమే క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. ఈరోజు మీడియా సమావేశంలో రిటైర్మెంట్‌పై కోహ్లీ మాట్లాడాడు.

Read More:

‘‘విరాట్ కోహ్లీ 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్‌లో తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా..?’’ అని మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ ‘2023 వరకూ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఒకసారి పునరాలోచించుకుంటాను. ఎందుకంటే.. గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో కనీసం 300 రోజులు క్రికెట్‌ కోసం కేటాయిస్తున్నాను (ఇందులో ప్రాక్టీస్, టీమ్ ప్రయాణాలు ఉన్నాయి). అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా మేము కూడా వ్యక్తిగతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ.. మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకి అది సాధ్యం కావడం లేదు. మరోవైపు టీమ్ నా నుంచి గెలిపించే ప్రదర్శన ఆశిస్తోంది. కాబట్టి.. మరో మూడేళ్లు (2023 వన్డే ప్రపంచకప్) వరకూ మూడు ఫార్మాట్లలో ఆడతాను. ఆ తర్వాత ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తా’ అని వెల్లడించాడు.

Read More:

2008, ఆగస్టులో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 248 వన్డేలు, 84 టెస్టులు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 70 అంతర్జాతీయ శతకాలు బాదిన కోహ్లీ.. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ.. టీ20ల్లో మాత్రం ఈ భారత కెప్టెన్ ఇటీవల పదో స్థానానికి పడిపోయాడు. ఈ నేపథ్యంలో.. కోహ్లీ వన్డే, టెస్టుల్లో కొనసాగుతూ.. టీ20లకి మాత్రం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More: