వన్డే వరల్డ్‌కప్ భారత సూపర్ ఫ్యాన్ చారులత ఇకలేరు

Share Icons:
గత వరల్డ్‌కప్ సందర్భంగా ఓవర్‌నైట్ సెన్సెషన్‌గా నిలిచిన భారత సూపర్ ఫ్యాన్ 87 ఏళ్ల మంగళవారం (ఈనెల13న) మరణించారు. గత జూలైలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. చారులతను చూసి మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ , వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆమె నుంచి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కోహ్లీని అప్యాయంగా ఆమె ముద్దాడిన సంగతి విదితమే. చక్రాల కుర్చీలో స్టేడియానికి వచ్చిన ఆమెను చూసిన భారత క్రికెటర్లు.. ఇక నుంచి జరిగే మ్యాచ్ టికెట్లు కొనిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక ఆ మ్యాచ్‌లో భారత జాతీయ పతాకపు రంగులతో తయారైన దుస్తులు ధరించిన చారులత.. బూర ఊదుతూ చేసిన సందడి ప్రత్యేకంగా నిలిచిపోయింది.

Read Also :
చారులత మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చారులత మరణంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌పై ఆమెకున్న ప్యాషన్ తమనెప్పుడు మోటీవేట్ చేస్తుందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరోవైపు చారులత మరణంపై ట్విట్టర్‌లో సంతాపం తెలిపింది.

Read Also :
ఇక వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా కోహ్లీ,రోహిత్‌ను కలవడం తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనగా గతంలో ఎన్నోసార్లు చారులత చెప్పారు. మరోవైపు 1983లో కపిల్ డెవిల్స్ వరల్డ్‌కప్ నెగ్గిన సందర్భంలో, ఫైనల్ జరిగిన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో తాను కూడా ఉన్నట్లు చారులత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. క్రికెట్ దాదీగా పేరు పొందిన చారులత మరణం విషాదకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Also :