వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్

Share Icons:
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్ సత్తాచాటాడు. కీలకమైన రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ ఛేదనలో ‘కంగారూ’ పడింది. ఈక్రమంలో తను భారత్ తరపున ఒక రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా నిలిచాడు.

Read Also :
నిజానికి ముంబైలో జరిగిన తొలి వన్డే ఆడినప్పటికీ ఆ మ్యాచ్‌లో కుల్దీప్ సహా భారత బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. దీంతో రెండో వన్డేలో సత్తాచాటిన యాదవ్.. కీలకమైన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ వికెట్లను తీసి ఆకట్టుకున్నాడు. దీంతో 44 మ్యాచ్‌ల్లోనూ వంద వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈక్రమంలో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన భారత స్పిన్నర్‌గా నిలిచాడు.

Read Also :
వన్డేల్లో భారత్ తరపున వంద వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 22వ భారత బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఓవరాల్‌గా తను ఎనిమిదో భారత స్పిన్నర్. మరోవైపు రాజ్‌కోట్‌లో శుక్రవారం జరిగిన రెండోవన్డేలో భారత్ 36 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 340/6 చేసింది. శిఖర్ ధావన్ (96) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (98) టాప్ స్కోరర్. మహ్మద్ షమీకి మూడు వికెట్లు దక్కాయి. నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. జస్‌ప్రీత్ బుమ్రకు ఒక వికెట్ లభించింది. తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో ఇండియా సమం చేసింది. తొలి వన్డేలో ఆసీస్ పది వికెట్లతో నెగ్గిన సంగతి తెలిసిందే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన మూడో వన్డే బెంగళూరులో ఆదివారం జరుగుతుంది.

Read Also :