వనితా విజయ్‌కుమార్‌ మూడో పెళ్లి.. ఆ ముచ్చట తీరిందో లేదో అప్పుడే కొత్త జంటపై పోలీస్ కేసు

Share Icons:
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో శనివారం రోజు (జూన్ 27) ఆమె వివాహం జరిగింది. అనే వ్యక్తిని వనితా విజయ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడం హాట్ ఇష్యూగా మారింది.

కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అతికొద్ది మంది సమక్షంలోనే వనితా విజయ్‌కుమార్‌- పీటర్ పాల్ వివాహం జరిగింది. పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కనిపించి భర్తకు ముద్దులు పెడుతూ హల్చల్ చేసింది వనితా విజయ్‌కుమార్. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో భర్త అయిన పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ రూపంలో ఈ జంటకు సమస్య ఎదురైంది.

Also Read:
తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ పాల్ మరో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ కొత్త జంటపై ఎలిజిబెత్ హెలెన్ పోలీస్ కేసు పెట్టింది.హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై కేసు నమోదు చేశారనేది లేటెస్ట్ సమాచారం. దీంతో జనాల్లో ఈ అంశం పలు చర్చలకు తావిచ్చింది.

కాగా 2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత విజయ్‌కుమార్.. 2007లో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనతోనూ విడాకులు తీసుకొని ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకొని పీటర్ పాల్‌ని మూడో భర్తగా పొందింది. తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన వనిత.. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాలో నటించింది.