వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే?

Share Icons:
న‌గ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ నెల (ఏప్రిల్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 11, 25 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే ఏప్రిల్ నెల‌లో వ‌చ్చే నాలుగు ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.

Also Read:

Also Read:

రెండో శనివారాలు, ఆదివారాల్లో సెలవులు కాకుండా ఏప్రిల్ నెలలో బ్యాంక్ ఉద్యోగులకు అదనంగా కూడా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 2న గురువారం రామ నవమి పండుగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇంకా ఏప్రిల్ 10న శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ఉంది. ఈరోజు కూడా బ్యాంకులకు సెలవు. ఇంకా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కారణంగా బ్యాంకులకు హాలిడే. ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు వర్తిస్తాయి.

ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.