‘వకీల్ సాబ్’కి ఒక్కరు కాదు.. ఇద్దరు, అందాల లావణ్యంకి పిలుపు!

Share Icons:
‘పింక్’ సినిమా కథను పవన్ కోసం కిచిడీ చేయబోతున్నారా? అనే సందేహాలకు మరింత బలాన్నిస్తున్నాయి కథానాయకిలకు సంబంధించిన రూమర్స్. లాంగ్ గ్యాప్ తరువాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సందేశాత్మక చిత్రం‘పింక్’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హిందీలీ అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పోషిస్తుండటంతో ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, థీం సాంగ్‌ను రిలీజ్ చేయడంతో తన స్టామినాను తిరిగి అందిపుచుకున్నారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్‌ అయ్యింది .

ఇదిలా ఉంటే.. హిందీలో అమితాబ్.. తమిళ్‌లో అజిత్ నటించినప్పటికీ ఈ సినిమాలో కథే హీరో.. లీడ్ రోల్స్‌లో చేసిన ఆ ముగ్గురు ఫీమేల్ లీడ్ రోల్స్ కథకు ప్రాణం. స్త్రీ స్వేచ్చ, హక్కులపై న్యాయ వ్యవస్థపై ముగ్గురు యువతులు ఎలా పోరాటం చేశారు.. వారికి వకీల్ సాబ్ ఏ విధంగా సాయపడ్డాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే సినిమాలో 80 శాతం వరకూ కోర్టు సీన్లు ఉండటంతో పవన్ కళ్యాణ్ పాత్ర పరిధి చాలా ఎక్కువే. అయితే ఈ సినిమాను పూర్తి కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్నారు.. ఎదో మెసేజ్ ఇచ్చాం అన్నట్టుగా కాకుండా నిర్మాతలకు నాలుగు డబ్బులు రావాలంటే కమర్షియల్ అంశాలు అవసరం కూడా తమిళ్‌లోనూ ఈ ఫాల్ములాను వర్కౌట్ చేశారు. అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోకుండా హీరోయిజాన్ని హైలైట్ చేయలేదు. కథలో భాగంగానే హీరోని చూపించారు. అయితే తెలుగుకి వచ్చేసరికి ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్‌లో పవన్‌ను హైలైట్ చేశారే తప్ప.. కన్సెప్ట్‌ను ఎక్కడా టచ్ చేయలేదు.

ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సాంగ్స్, ఫైట్స్‌తో పవన్‌ను ఓ రేంజ్‌లో చూపిస్తున్నరనే వార్తలు వస్తున్నాయి. పవన్‌కి జోడీగా శృతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆమె ప్లేస్‌ను ఇలియానాతో రీ ప్లేస్ చేసినట్టుగా ప్రచారం నడుతస్తున్న సందర్భంలో ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు అనేది మరో హాట్ టాపిక్. అంతేకాదు వవన్‌కి సెకండ్ హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారని.. ఆమెకు ‘వకీల్ సాబ్’ నుంచి పిలుపు రావడంతో షూటింగ్‌కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఒరిజినల్ కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కొరకు ఓ క్యామియో ఎంట్రీకి ఆస్కారం ఉంటుంది. హీరోయిన్ స్పేస్ చాలా తక్కువ. ఇప్పుడు తెలుగు కథలో హీరోయిన్స్ స్పేస్‌ను పెంచడమే కాకుండా.. ఇద్దరు హీరోయిన్లు పెడుతున్నట్టుగా వార్తలు వస్తుండటంతో.. పింక్ కథను మార్పులు చేసి పవన్ ఫ్యాన్స్‌ కోరుకునే విధంగా కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ’సినిమా మొదట్లో పవన్ హీరోయిన్‌తో రొమాన్స్, కొన్ని పాటలు అలా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ నడిపిస్తే మళ్లీ పవన్ సినిమానే చూస్తున్నట్లు అనిపిస్తుంది’ అని పరుచూరి లాంటి సీరియర్ రైటర్స్ సలహాలను చిత్ర యూనిట్ ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.