లైట్ ఫర్ ఇండియా: దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన టాలీవుడ్ స్టార్స్

Share Icons:
దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి.. దీపాలను, టార్చ్‌లను వెలిగించారు. 9 నిమిషాల పాటు ఈ దీపాలను వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు. ఐక్యతను చాటుకున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు దీపాలు పట్టుకుని నిలబడ్డారు. అలాగే, స్టైలిష్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో దీపాలు వెలిగించారు. అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ దీపాలను లాంథర్‌లో పట్టుకుని బాల్కనీలోకి వచ్చారు. నాగార్జున తన భార్య అమల, కుమారుడు అఖిల్‌తో కలిసి దీపాలను వెలిగించారు. మహేష్ బాబు కూడా దీపం వెలిగించారు. ఈ సందర్భంగా తీసుకున్న క్లోజప్ షాట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్యతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. ఆయన మిత్రుడు మంచు మోహన్ బాబు కొవ్వొత్తి వెలిగించారు. మంచు విష్ణు, రాశీ ఖన్నా, గోపీచంద్, మంచు లక్ష్మి, తమన్నా, పూజా హెగ్డే, కార్తికేయ, అల్లు శిరీష్, నాగశౌర్య, ముస్కాన్, అవంతికా మిశ్రా, నందు-గీతామాధురి దంపతులు, ఉత్తేజ్ కుటుంబం, శ్రీను వైట్ల కుంటుంబం తదితరులు దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు తెలుగు సినీ పరిశ్రమ పూర్తి మద్దతును తెలియజేసింది.