లెజెండ‌రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస‌రావుకు క‌రోనా పాజిటివ్

Share Icons:
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ నెల 9వ తేదీన చెన్నైలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బుధవారం ఆయన ఫేస్‌బుక్ వీడియో ద్వారా వెల్లడించారు. డాక్టర్లు సలహా మేరకు ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, అభిమానులెవరూ ఆందోళన పడొద్దని తెలిపారు. వచ్చే మంగళవారం(సెప్టెంబర్ 22) నాటికి క్వారంటైన్ ముగుస్తుందని వెల్లడించారు.

ఎప్పుడూ నవ్వుతూ చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉండే సింగీతం తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా అలాగే వెల్లడించారు. 65 ఏళ్లుగా నేను పాజిటివ్‌గానే ఉన్నా. కానీ డాక్టర్లు ఇప్పుడు కొత్తగా కోవిడ్ పాజిటివ్ అని చెబుతున్నారంటూ స‌రదాగా మాట్లాడారు. హోమ్ ఐసోలేష‌న్‌లో భాగంగా ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ సోకిందన్నారు.

Also Read:

లెజెండరీ డైరెక్టర్‌గా ప్రఖ్యాతి చెందిన సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో హస్యభరిత, సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఆయన చివరిగా 2013లో ‘వెల్‌కమ్‌ ఒబామా’ సినిమాకు దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్‌, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ (2015)లో అతిథి పాత్రలో మెరిశారు.

Also Read: