లావణ్య త్రిపాఠి వేలికి రింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? సీక్రెట్ రివీల్

Share Icons:
ప్రస్తుతం టాలీవుడ్ అంతా‌ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతోంది. లాక్‌డౌన్ వేళ సినీ తారలంతా వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానాలు పెళ్లి బాజాలు మోగించేసి ఎంజాయ్ చేస్తుండగా.. రీసెంట్‌గా హీరోయిన్ కాజల్ తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూని పెళ్లాడబోతున్నట్లు చెప్పేసింది. దీంతో టాలీవుడ్ సినీ లోకంలో ఎక్కడచూసినా తారల పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ చాట్ చేసి తన పెళ్లి రహస్యాన్ని కూడా రివీల్ చేసింది .

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్స్‌తో సరదాగా కాసేపు చాట్ చేసింది లావణ్య. దీంతో నెటిజన్స్ అంతా ఈ భామ పెళ్లి సంగతులపైనే ఫోకస్ పెట్టారు. 29 ఏళ్ల లావణ్య పెళ్లి మ్యాటర్ తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:
లావణ్య వేలికి ఉన్న ఉంగరం చూసి.. మీ నిశ్చితార్థం అయిపోయిందా? మరి పెళ్లి ఎప్పుడు? అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో తనకు నిశ్చితార్థం కాలేదని క్లారిటీ ఇచ్చింది అందాల రాక్షసి. అయినా అమ్మాయిలు వేలికి ఉంగరం పెట్టుకుంటే నిశ్చితార్థం పూర్తయినట్లేనా? అమ్మాయిలు ఉంగరాలు కొనుక్కోలేరా? అంటూ ఫైర్ అయింది. ఇంతలో మరో నెటిజన్ పెళ్ళెప్పుడు అక్కా? అని మరో ప్రశ్న వేయడంతో చిర్రెత్తిపోయిన ఆమె.. మా‌ పేరెంట్స్‌కే లేని బాధ మీకెందుకు? అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది.

దీంతో మొత్తానికైతే తన పెళ్లి ఇప్పట్లో ఉండదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ అమ్మడు ”చావుకబురు చల్లగా, ఏ-1 ఎక్స్‌ప్రెస్” సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.