రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే టీవీకి అతుక్కుపోతాను

Share Icons:
భారత వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ విధ్వంసకర బ్యాటింగ్ శైలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతేడాది వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలతో ప్రపంచరికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ పాకిస్థాన్ లెజెండర్ జహీర్ అబ్బాస్‌ను కూడా ఫిదా చేసింది. తాను బ్యాటింగ్ చేస్తుంటే టీవీ ముందు నుంచి కదలనని తాజాగా తెలిపాడు.

Read Also :
తాజాగా జహీర్ మాట్లాడుతూ.. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే టీవీ ముందు నుంచి కదలనని, బంతిని తాను ఎటువైపు అనుకుంటే అటువైపు కొట్టగల సామర్థ్యం హిట్‌మ్యాన్ సొంతమని అన్నాడు. బంతి గమనాన్ని ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా షాట్ సెలెక్షన్ ఎంపిక చేసుకుంటాడని ప్రశంసించాడు. హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చూడటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పొగడ్తల వర్షం కురిపించాడు.

Read Also :
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా జహీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీవీలో రోహిత్ ఆడుతున్నప్పుడు తనింట్లో వారు కోహ్లీ గురించి అడుగుతారని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ కూడా తక్కువేం కాదని, కోహ్లీ సిసలైన బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు. అయితే రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం టీవీ ముందు కదలనని తెలిపాడు. ఇద్దరూ కలిసి ఆడితే చూడటానికి చాలా బాగుంటుందని జహీర్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో ప్రారంభమైన తొలి వన్డేలో రోహిత్ ఈ ఏడాది తొలిసారిగా బరిలోకి దిగాడు. అయితే 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.

Read Also :