రోహిత్ శర్మతో ఈరోజు పీటర్సన్ ఇంటర్వ్యూ

Share Icons:
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మని గురువారం తాను స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసిన పీటర్సన్.. అభిమానులు కూడా జాయిన్ కావొచ్చని తెలియజేశాడు. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దవగా.. ప్రస్తుతం క్రికెటర్లు ఇంటి దగ్గరే ఉంటున్న విషయం తెలిసిందే.

Read More:

భారత అభిమానులతో ఇటీవల కెవిన్ పీటర్సన్‌కి మంచి అటాచ్‌మెంట్ ఏర్పడింది. కరోనా వైరస్ కట్టడి కోసం సామాజిక దూరం పాటించాలని హిందీలో సూచనలు చేస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. అలానే ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలో 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌కి కూడా పీటర్సన్ తన మద్దతు తెలిపాడు. దీంతో.. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు వర్షం కురిసింది. తాజాగా రోహిత్ శర్మని ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. భారతీయులకి మరింత చేరువకావాలని ఈ ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ ఆశిస్తున్నాడు.

Read More:

‘‘నమస్తే ఇండియా.. కరోనా వైరస్ విషయంలో మీ పరిస్థితి కూడా మా దేశం తరహాలోనే ఉందని విన్నాను. ప్రధాని మోడీ 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. కాబట్టి.. నా అభ్యర్థన ఏంటంటే..? దయచేసి ప్రభుత్వ సూచనల్ని పాటించండి. మనమంతా కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాడి.. అరికడతాం’’ అని పీటర్సన్ సూచించాడు.