రోహిత్ కెప్టెన్సీ అచ్చు ధోనీలాగే ఉంటుంది: భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్‌

Share Icons:
భార‌త వైట్‌బాల్ క్రికెట్ వైస్‌కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సార‌థ్యాన్ని వెట‌ర‌న్ ప్లేయ‌ర్ పోల్చి చూశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలాగానే రోహిత్ కెప్టెన్సీ ఉంటుంద‌ని వ్యాఖ్యానించాడు. కీల‌క స‌మ‌యాల్లో హిట్‌మ్యాన్ ఎంతో కూల్‌గా ఉంటాడ‌ని వ్యాఖ్యానించాడు. ఇటీవ‌లే పుణేతో జ‌రిగిన ఫైన‌ల్‌ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ చూశాన‌ని, ఆ మ్యాచ్ కీల‌క‌ద‌శ‌లో త‌ను నాయకత్వ ప్రతిభ‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. మ‌రోవైపు రోహిత్‌లో ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంద‌ని, ఇలాంటి ప్లేయ‌ర్ మిగ‌తా స‌హ‌చ‌రుల్లో స్ఫూర్తినింప‌గ‌ల‌డని ఆశాభావ్యం వ్య‌క్తం చేశాడు.

Must Read:
ఇక ఎలాంటి ఒత్తిడి ప‌రిస్థితుల్లోనైనా, ఏమాత్రం తొణ‌కకుండా హిట్‌మ్యాన్ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటాడని రైనా తెలిపాడు. ఐపీఎల్లో త‌నంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా నిల‌వ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని వ్యాఖ్యానించాడు. త‌నో బిందాస్ ప్లేయ‌ర‌ని, ఎలాంటి ప‌రిస్థితుల్లో బ్యాటింగ్ దిగిన ప‌రుగులు సాధిస్తాన‌నే న‌మ్మ‌కమున్న అరుదైన ప్లేయ‌ర‌ని కొనియాడాడు.

Must Read:
మ‌రోవైపు ధోనీ కెప్టెన్సీపై రైనా ప్ర‌శంస‌లు కురిపించాడు. 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న‌ను అనూహ్యంగా టాపార్డ‌ర్‌లో ధోనీ ఆడించాడ‌ని, ఆ మ్యాచ్‌లో భారీ అర్ధ‌సెంచ‌రీని సాధించినట్లు గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులో ఇద్ద‌రు లెగ్ స్పిన్న‌ర్లు ఉన్నార‌ని, అందుకే త‌న‌ను టాపార్డ‌ర్‌లో ఆడించాన‌ని ధోనీ చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. ధోనీ ఆలోచ‌న తీరు చాలా ముందుంటుంద‌ని, అనేక విష‌యాలో త‌న‌కున్న అవ‌గాహ‌న ఆమోఘ‌మని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆలోచ‌న తీరు దేవుడిచ్చిన బహుమ‌త‌ని రైనా తెలిపాడు.