రేటు పెంచేసిన ‘నగ్నం’ స్వీటీ… అయినా వెంటపడుతున్న నిర్మాతలు!

Share Icons:
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలుగు ఇండస్ట్రీపై వదిలిన శృంగార బాణం . ఆయన తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమాలో హాట్‌ హాట్ భంగిమలు చూపిస్తూ కుర్రకారుకు సెగలు రేపిన శ్రీ.. ఆ ఇమేజ్‌తోనూ ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మత్తెక్కించే కళ్లు, ఆకర్షించే శరీర సౌష్ఠవంతో శృంగార తార ఇమేజ్‌ కోసం తాపత్రయపడుతోంది. తొలి సినిమాతోనే తన అందాలన్నీ బయటపెట్టేసిన శ్రీ రాపాకకు ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. దీంతో ఆ అమ్మడు రేటు పెంచేసినట్లు తెలుస్తోంది.

Also Read:

నగ్నం సినిమాకు సంబంధించి ఆమె రోజుకు రూ.1-2 లక్షల వరకు రెమ్యునరేషన్‌ ఇచ్చారట. ప్రస్తుతం ఆమె ‘ద లస్ట్’ అనే వెబ్‌ సిరీస్‌‌లో నటిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్‌ శ్రీ తన హొయలన్నీ ఒలకబోస్తూ ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటూ ఇక అసలు కంటెంట్‌ ఎలా ఉంటుందోనని వీక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఆమె మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 1990 కాలంలో జరిగిన ఓ ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కాత్యాయని’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

శ్రీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేశారట. హాట్‌ హాట్‌గా క‌నిపించేందుకు ఆమె ఎలాంటి అభ్యంత‌రాలు పెట్టక‌పోవ‌డంతో రూ.10లక్షలైనా ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారట. మొత్తానికి వర్మ ‘నగ్నం’ సినిమా శ్రీకి బాగానే కలిసొచ్చింది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎలాంటి గుర్తులేని ఆమెకు వర్మ కారణంగా లక్‌ మారినట్లే చెప్పుకోవాలి.