రేటు పెంచిన ‘ఇస్మార్ట్’ భామ.. నిర్మాతలకు దడ పుట్టిస్తోందట

Share Icons:
దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కదిద్దుకోవాలి అన్నట్లు.. చేతిలో సినిమాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనుకుంటోంది గ్లామరస్ హీరోయిన్ . ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన సత్తాను నిరూపించుకున్న నభాకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజకు జోడీగా నటించిన ‘డిస్కోరాజా’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన తర్వాతి సినిమాను ఇంకా ప్రకటించపోయినా బాగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక నుంచి తాను రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒక్కో సినిమాకు 80 లక్షల రూపాయలు ఇస్తే కానీ సినిమా చేయదట. దాంతో నిర్మాతలు, డైరెక్టర్లు ఆమెను సినిమాలో తీసుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం నభా ఆశలన్నీ ‘డిస్కోరాజా’ సినిమా పైనే ఉన్నాయి. ఇందులో నభాది డీ గ్లామరస్ రోల్. ఈ పాత్ర తనను తప్పకుండా ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని నభా కాన్ఫిడెంట్‌గా ఉంది. నభా అలా అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ నభా ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ ఐదు సినిమాల్లో నభాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’.

READ ALSO:

అంతకుమించి ఆమె ఖాతాలో ఎలాంటి హిట్స్ లేవు. అలాంటప్పుడు ఆమె అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం సబబు కాదేమోనని టాలీవుడ్‌లో కొందరి అభిప్రాయం. అంతేకాదు కుర్ర హీరోలకు జోడీగా నటించకూడదని నియమం పెట్టుకుందట. ఇక నుంచి ఏ సినిమా చేసినా పెద్ద హీరోలతోనే చేయాలని అనుకుంటున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. మరి ఈ ‘ఇస్మార్ట్’ భామ డిమాండ్స్‌కు టాలీవుడ్ ఏమంటుందో ‘డిస్కోరాజా’ విడుదల అయ్యాక చూడాలి.

READ ALSO: