రెచ్చిపోయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’ యాక్టర్.. యంగ్ హీరోయిన్‌తో రొమాన్స్.. వీడియో వైరల్

Share Icons:
రామ్ చరణ్‌తో ‘చిరుత’ సినిమాలో రొమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ నేహా శర్మతో రొమాంటిక్ వీడియోలో కనిపించి పిచ్చెక్కించాడు ” ఫేమ్ (శివ). ఇద్దరూ కలిసి ఓ పాట కోసం జోడీ కట్టి రక్తికట్టించారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో 10వ స్థానంలో ఉంది.

‘దిల్‌ కో కరార్ ఆయా‌’ అంటూ సాగిపోతున్న ఈ వీడియో సాంగ్‌లో హీరోయిన్ అందాలు, ఆమెతో సిద్దార్ధ్ శుక్లా చేసిన రొమాన్స్ తాలూకు సీన్స్ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం రోజు విడుదలైన ఈ సాంగ్ కేవలం 9 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రాబట్టడం విశేషం. నేహా కక్కర్, యస్సార్ దేశాయ్ పాడిన ఈ పాటకు రజత్ నాగ్‌పల్ సంగీతం అందించాడు.

Also Read:
అటు సంగీత ప్రియులను, ఇటు రొమాంటిక్ ప్రియులను మంత్రముగ్దులను చేస్తున్న ఈ పాటను సిద్దార్థ్ శుక్లా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ”మీరంతా ఈ సాంగ్ ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఈ పాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి” అంటూ ఈ పాటను షేర్ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. ”ఈ పాట చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేక పోతున్నాం, రొమాంటిక్ సీన్స్ అదుర్స్, సూపర్ సాంగ్” అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.