రిషబ్ పంత్‌ కంకషన్.. వికెట్‌కీపర్‌గా రాహుల్

Share Icons:
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ గాయపడటంతో అతని స్థానంలో లోకేశ్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీని గురించి బీసీసీఐ ట్విట్టర్‌లో స్పందించింది. గాయానికి గురైన పంత్ ‌ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, అందుకే రాహుల్ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిపింది.

భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్లో రిషబ్ పంత్ గాయపడ్డాడు. కమిన్స్ వేసిన బౌన్సర్‌ను ఫుల్‌షాట్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. బంతి పంత్ బ్యాట్‌కు తాకి టాప్ ఎడ్జ్ తీసుకుని అతని హెల్మెట్‌ను బలంగా తాకింది. అనంతరం పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్టన్ టర్న్ చేతిలో పడింది. అయితే క్యాచ్ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ప్రకటించలేదు. అయితే నిజాయతీగా వ్యవహరించిన పంత్.. పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం పంత్ కంకషన్‌కు గురైనట్లు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణాయానికొచ్చింది.

Read Also :
ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో పంత్ స్థానంలో రాహుల్ వికెట్ కీపర్ అవతారమెత్తాడు. మనీశ్ పాండే..కంకషన్ ప్లేయర్ రూపంలో ఫీల్డింగ్ చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Read Also :