రాహుల్ ద్రవిడ్ సంచలన ఫీల్డింగ్.. వీడియో వదిలిన భజ్జీ

Share Icons:
అనగానే అందరికీ గుర్తొచ్చేది సహనంతో కూడిన అతని బ్యాటింగ్. ముఖ్యంగా.. టెస్టుల్లో పాకిస్థాన్ ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌండరీ లైన్ సమీపం నుంచి రన్నప్‌తో వచ్చి గంటకి 150కిమీ వేగంతో బంతిని సంధించినా.. ద్రవిడ్ తన బ్యాటింగ్ టెక్నిక్‌‌తో బంతి కనీసం క్రీజు వెలుపలికి కూడా వెళ్లకుండా డిఫెన్స్ చేసేవాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బ్యాటింగ్ చేసే ద్రవిడ్.. టీమ్ వికెట్లు చేజారుతున్న సమయంలో క్రీజులో పాతుకుపోయేవాడు. అందుకే.. అభిమానులు ముద్దుగా అతడ్ని వాల్ అని పిలుచుకునేవారు.

బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్, కెప్టెన్‌గా ద్రవిడ్ అందరికీ సుపరిచితమే. కానీ.. అన్నింటికీ మించి ద్రవిడ్.. ఓ అద్భుతమైన ఫీల్డర్. ఈ విషయాన్ని తాజాగా ఓ వీడియోతో అతని ఒకప్పటి సహచరుడు హర్భజన్ సింగ్ అభిమానులకి గుర్తు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ స్లిప్‌ ఫీల్డర్లలో ఒకడిగా ఉన్న ద్రవిడ్.. ఏకంగా 210 క్యాచ్‌లు పట్టాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ ఫీల్డర్ కూడా టెస్టుల్లో ఇన్ని క్యాచ్‌లు పట్టలేదు.

రాహుల్ ద్రవిడ్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించగా.. అతని తర్వాత టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లుగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనె (205 క్యాచ్‌లు), దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (200) టాప్-3లో కొనసాగుతున్నారు. స్లిప్‌లోనే కాకుండా.. జట్టు అవసరాలకి అనుగుణంగా కెప్టెన్ ఎక్కడ చెప్తే అక్కడ ద్రవిడ్ ఫీల్డింగ్ చేసేవాడు.

బ్యాట్స్‌మెన్‌గా 164 టెస్టులాడిన ద్రవిడ్ 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,899 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా 73 మ్యాచ్‌లాడిన ద్రవిడ్ 84 ఔట్లలో భాగస్వామ్యుడయ్యాడు. ఇందులో 71 క్యాచ్‌లు, 13 స్టంపౌట్లు ఉన్నాయి.