రాయుడు, చావ్లా లో ప్రొఫైల్ క్రికెటర్లా..? మళ్లీ కెలికిన మంజ్రేకర్

Share Icons:
భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్ల చేతికి చిక్కాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాని అరకొర ఆటగాడంటూ ఎద్దేవా చేసిన సంజయ్ మంజ్రేకర్‌ని కామెంట్రీ ఫ్యానల్ నుంచి ఈ ఏడాది మార్చిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించగా.. ఐపీఎల్ 2020 సీజన్ కామెంట్రీ ఫ్యానల్‌లోనూ స్టార్ స్పోర్ట్స్ చోటివ్వలేదు. నోరు అదుపులోకి పెట్టుకుంటానని.. ఐపీఎల్‌ కామెంట్రీకి అవకాశం కల్పించాలని బీసీసీఐకి అతను లేఖ రాసినా ఫలితం లేకపోయింది.

ఐపీఎల్‌లో తొలిసారి కామెంట్రీకి దూరంగా ఉంటున్న సంజయ్ మంజ్రేకర్.. ఈ ఏడాది ఫస్ట్ మ్యాచ్‌లోనే తన ట్వీట్‌తో భారత క్రికెట్ అభిమానులకి కోపం తెప్పించాడు. అబుదాబి వేదికగా శనివారం రాత్రి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా.. చెన్నై టీమ్‌లో (71: 48 బంతుల్లో 6×4, 3×6), పీయూస్ చావ్లా (1/21) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ పడగొట్టిన చావ్లా.. చెన్నై వికెట్ల ఖాతాని ప్రారంభించగా.. ఛేదనలో రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

సురేశ్ రైనా, పీయూస్ చావ్లాని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన సంజయ్ మంజ్రేకర్.. ఇద్దరినీ లో ప్రొఫైల్ క్రికెటర్లుగా అభివర్ణించాడు. దాంతో.. నెటిజన్లు మంజ్రేకర్‌ని ఉతికారేస్తున్నారు. గతంలోనూ ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ని మతిలేని క్రికెటర్‌గా మంజ్రేకర్ అభివర్ణించిన విషయం తెలిసిందే. మొత్తంగా.. కామెంట్రీ ఫ్యానల్‌కి దూరమైనా.. మంజ్రేకర్ తీరు మాత్రం మారలేదు.