రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఓల్డ్ లుక్.. హాలీవుడ్ హీరోల్లా ఉన్నారు!

Share Icons:
వయసు మళ్లిన తరవాత మనం ఎలా ఉంటామో ఊహించుకుంటేనే భలే గమ్మత్తుగా ఉంటుంది. అలాంటిది మన ముసలి రూపం మన కళ్లముందే ప్రత్యక్షమైతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ‘ఫేస్ యాప్’ ఉపయోగించి చాలా మంది తమ వృద్ధ రూపాన్ని చూసి మురిసిపోతున్నారు. అలాగే, తమకు తెలిసిన వ్యక్తులు కూడా వయసు మళ్లాక ఎలా ఉంటారో చూసి తెగ నవ్వుతున్నారు. కానీ, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వృద్ధ రూపంలో చూసిన మెగా అభిమానులు వాహ్ అంటున్నారు.

ఆదివారం (జనవరి 19న) వరుణ్ తేజ్ పుట్టినరోజును పురష్కరించుకుని రామ్ చరణ్ ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు. వరణ్‌తో కలిసి గతంలో తాను తీసుకున్న ఒక ఫొటోను ఫేస్ యాస్ ఉపయోగించి ఓల్డేజ్ ఫొటోలా తయారు చేశారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వయసు మళ్లుతుండటాన్ని ఆస్వాదించు వరుణ్ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటోలో చరణ్, వరుణ్ ఓల్డ్ లుక్‌లో భలే ఉన్నారు. నిజం చెప్పాలంటే వయసు మళ్లిన హాలీవుడ్ హీరోల్లా ఉన్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం చరణ్ RRR షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు, వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్‌, సిద్ధు ముద్దాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బాక్సర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ విపరీతంగా వైరల్ అయ్యింది.