రానా విడుదల చేసిన హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ గ్లింప్స్.. ఇంట్రస్టింగ్!

Share Icons:
‘ఫ్రెండ్‌షిప్’ మూవీ ద్వారా ప్రముఖ క్రికెటర్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాన్‌పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, రజినీకాంత్ ఆంథమ్ ఆకట్టుకున్నాయి.

Also Read:

కాగా, నేడు వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డేను పురష్కరించుకుని ‘గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ పేరిట వీడియోను వదిలారు. ఈ వీడియోను హీరో రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. హర్భజన్, సతీష్ స్నేహితులుగా కనిపించారు. భజ్జీ పోలీసు వాహనం నుంచి స్నేహితులతో దిగుతూ కనిపించారు. అంటే, ఇది క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. అర్జున్ పాత్ర స్టైలిష్‌గా ఉంది. ఇక ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తం ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని కలుగజేస్తోంది.