రానా – మిహీకా పెళ్లి: వధువు ఇంటి వద్ద పండగ వాతావరణం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో

Share Icons:
తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. హిందూ సంప్రదాయబద్ధంగా జరిగే వీరి వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. రానా ఇంటి వద్ద ఎలాంటి హడావుడి కనిపించకపోయినప్పటికీ మిహీకా బజాజ్ ఇంటి వద్ద మాత్రం సంబరాలు మొదలైపోయాయి. జూబ్లీహిల్స్‌లోని బజాజ్ ఇంటిని బుధవారం అందంగా ముస్తాబు చేశారు. బుధవారం వధువు ఇంట పసుపు దంచే కార్యక్రమంతో వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.

బుధవారం రాత్రి మిహీకా మెహందీ వేడుక నిర్వహించనున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, మిహీకా క్లోజ్‌ ఫ్రెండ్స్ మధ్య ఈ వేడుక వైభవంగా జరగనుంది. మరోవైపు రానా ఇంట అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించనున్నారు. రానాను పెళ్లికొడుకుని చేసే కార్యక్రమం దగ్గుబాటి వారి ఇంట వేడుకగా జరగనుంది. ఇక 8వ తేదీన రామానాయుడు స్టూడియోస్‌లో ముస్తాబుచేసే మండపంలో రానా, మిహీకా పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఈ పెళ్లిని సురక్షితమైన వేడుకగా నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన అన్ని జాగ్రత్తలను దగ్గుబాటి ఫ్యామిలీ తీసుకుంటోంది.

Also Read:

పెళ్లి వేడుకలో 30 మందికి మించి హాజరుకారని రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు ఇప్పటికే స్పష్టం చేశారు. తమ ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న తమ అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదన్నారు. కొవిడ్-19 కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకను చాలా సురక్షితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పెళ్లికి హాజరయ్యే అందరికీ కచ్చితంగా ముందుగానే కరోనా పరీక్షలు చేయిస్తామని స్పష్టం చేశారు.