రానా- మిహీకా పెళ్లిలో మెరిసిన సమంత, వావ్ అనిపిస్తున్న డిజైనర్ దుస్తులు

Share Icons:
రానా-మిహీకా పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అక్కినేని కోడలు . నాగచైతన్య దగ్గుబాటి వారి మనువడే కావడంతో రానా పెళ్లిలో సందడి చేస్తుంది సమంత. ఈరోజు (ఆగష్టు 08) రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో రానా-మిహీకా పెళ్లి వేడుక జరగనుండగా.. అతిథులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.

కరోనా నేపథ్యంలో ఇరుకుంటుంబాల నుంచి కేవలం 30 మంది బంధువులు మాత్రమే హాజరుకగా.. వివాహ వేదిక వద్దకు చేరుకుంది సమంత. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ డిజైనర్ వేర్‌లో మెరిసింది సమంత. అంతకు ముందు హ‌ల్దీ, మెహందీ వేడుక‌ల్లోనూ సందడి చేసింది సమంత. మెహిందీ వేడుక కోసం ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుంది సమంత. ప్ర‌ముఖ డిజైన‌ర్ అర్పిత మెహ‌తా డిజైన్ చేసి ఈ డ్రెస్ ధర రూ.60 వేలు పైమాటే అంటున్నారు. ఇక పెళ్లిలో వేసుకున్న డిజైనర్ దుస్తులు అంతకు మించే ఎక్కువే అంటున్నారు. అక్కినేని కోడలు అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది మరి అంటూ వేడుకలో సమంత హంగామా ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆమె అభిమానులు.

ఇక రానా పెళ్లివేడుకలో సమంతతో పాటు ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అదరహో అనిపించారు.