రానా పెళ్లిని స్కోప్‌లో చూస్తున్న నాని.. ఇదేంటి టెక్నాలజీ బాబాయ్ అంటూ

Share Icons:
దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి వేడుక కోసం ఆయన అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వీరి పెళ్లికి 30 మంది అతిథుల్నిమాత్రమే ఆహ్వానించారు. ఇక మీడియాకి కూడా పర్మిషన్ లేకపోవడంతో రానా పెళ్లికి సంబంధించిన ఫొటోలు కాని.. వీడియోలు కాని బయటకు రావడం గగనంలా మారింది.

ఈరోజు రాత్రి 8.30 గంటలకు రానా-మిహీకా పెళ్లి ముహూర్తం కాగా.. ఈ పెళ్లి వేడుకను ఇంటి దగ్గర నుంచే చూడటానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు సెలబ్రిటీలు. అయితే రానా పెళ్లి వేడుకను స్కోప్‌లో చూస్తూ.. ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు నాని. తనదైన శైలిలో వెరైటీగా రానాకి విషెష్ అందించిన నాని.. ఈ టెక్నాలజీ ఏంటో అంటూ కామెంట్ చేశాడు.

వాచింగ్ ది ఎండ్ ఆఫ్ ఏన్ ఐకానిక్ బ్యాచ్‌లర్అంటూ ఈ ఫొటోకి ఫన్నీ కామెంట్ చేసిన నాని.. కంగ్రాట్స్ బాబాయ్ అంటూ రానాకి పెళ్లి విషెష్ అందించారు. అయితే అన్నా.. నువ్ ఒక్కడివే చూస్తే ఎలా.. మాకూ రానా పెళ్లి వేడుకను చూపించవచ్చు కదా అంటూ నాని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: