రానాకు మంచులక్ష్మీ సలహా.. పెళ్లి తర్వాత వెంటనే..!

Share Icons:
ప్రస్తుతం ఎక్కడ చూసినా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి పెళ్లి టాపికే నడుస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా తన ప్రేయసి మిహికా బజాజ్‌ని ఒక్కసారిగా అందరి ముందుకు తీసుకొచ్చి సంచలనం సృష్టించారు రానా. ఆ వెంటనే రానా తండ్రి సురేష్ బాబు కూడా సానుకూలంగా స్పందిస్తూ వీరి మ్యారేజ్ ఈ ఏడాదే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు మొన్ననే రోకా ఫంక్షన్ చేసుకొని ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు రానా- మిహికా. ఈ క్రమంలోనే తెలుగు చిత్రసీమలో హాట్ ఇష్యూగా మారిన ఈ అంశంపై రానాతో కాసేపు ముచ్చటించింది .

వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలో మిహికాతో పరిచయం, ఆమె ఎవరు? తమ మధ్య ఎలా ప్రేమ చిగురించింది అనే విషయాలు చెప్పారు రానా దగ్గుబాటి. ఇందులో భాగంగానే తన పెళ్లి సంగతులు, జ్ఞాపకాలు రానాతో షేర్ చేసుకుంటూ ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ప్రశ్నలు సంధించింది మంచు లక్ష్మి. తన పెళ్లికి ముందు గౌరీపూజ చేసే సమయంలో చాలా నెర్వెస్‌గా ఫీలయ్యానని, బాగా తెలిసిన వ్యక్తితో పెళ్లి జరుగుతుందని తెలిసినా ఏదో తెలియని భయం వెంటాడిందని, చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని పూజకు వెళ్తూ పారిపోదామనుకొన్నానని చెప్పిన మంచు వారమ్మాయి.. మరి నీ ఫీలింగ్స్ ఏంటి? అని రానాను ప్రశ్నించింది.

దీనికి బదులిచ్చిన రానా.. చిన్నతనంలో పెళ్లి జరిగితే నిజంగా అలాంటి ఫీలింగ్ కలిగేదేమో. కానీ మనం చాలా మెచ్యుర్డ్ స్టేజ్‌లోకి వెళ్లాం. అన్ని విషయాల పట్ల అవగాహన వచ్చింది కాబట్టి ఇలాంటి ఫీలింగ్ రాదని అన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ క్రమంలో నీకో సలహా అంటూ.. పెళ్లి చేసుకున్నాక వెంటనే పిల్లల్ని కనేసెయ్ అని చెప్పింది మంచు లక్ష్మి. త్వరలోనే నేను బుల్లి రానా చుట్టూ పరిగెత్తే పెద్ద రానాను నేను చూడాలని ఆమె పేర్కొంది.

Also Read:
రానాకు కాబోయే భార్య మిహికా బజాజ్.. ఓ మిహీకా ఒక ఈవెంట్ ప్లానర్. ‘డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో’ అనే సంస్థను సొంతంగా నడిపిస్తోంది. నార్త్ ఇండియన్ అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగింది. వెంకటేష్ కూతురు ఆశ్రితకు మిహీకా క్లాస్‌మేట్. ఆ కారణంగానే మిహికాతో రానాకు పరిచయం ఏర్పడి ప్రేమ దాకా వెళ్ళింది. త్వరలోనే రానా- మిహికా ఒక్కటి కానున్నారు.