రాజ్‌తరుణ్ సినిమా షూటింగ్ అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు

Share Icons:
కరోనా నుంచి కోలుకుంటున్న తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగులతో బిజీగా మారుతోంది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగుల్లో పాల్గొంటున్నారు. గతంలో సినిమా షూటింగులు స్టుడియోలతో పాటు జనావాసాల్లోనూ జరిగేవి. కానీ కరోనా భయంతో ఇప్పుడు కేవలం స్టుడియోల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ పబ్లిక్ ప్రాంతాల్లో షూటింగులు చేసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

Also Read:

అసలు విషయానికొస్తే ఇటీవలే ‘ఒరేయ్ బుజ్జిగా’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వనమాలి క్రియేషన్స్‌ బ్యానర్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీని షూటింగ్ ప్రస్తుతం ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో జరుగుతోంది. అయితే ఇందుకుగాను యూనిట్ స్టానిక పోలీసుల అనుమతి తీసుకోలేదట. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ నిలిపివేశారు. అనుమతి లేకుండా పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ నిర్వహించినందుకు ప్రొడక్షన్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.