రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి స్టెప్పులేస్తున్న చిరంజీవి చిన్నల్లుడు

Share Icons:
హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్‌ను కొన‌సాగిస్తున్నారు. ప్రస్తుతం క‌ళ్యాణ్ దేవ్‌, న‌ట‌కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ల‌పై హైద‌రాబాద్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ పాట‌ను కాస‌ర్ల శ్యామ్ రాయ‌గా, ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చిత్రీక‌రిస్తున్న పాట‌తో పాటు మ‌రో పాట మాత్రమే చిత్రీక‌రించాల్సి ఉంది. ప్రభుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ జ‌రుపుతున్నారు. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను కూడా నిర్వహిస్తున్నామ‌ని చిత్ర బృందం తెలిపింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తొలి సినిమా ‘విజేత’తో ఆకట్టుకున్న కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఇప్పటి వ‌ర‌కు తీసిన పాటలు చాలా అందంగా వచ్చాయి. ఆడియో బ్లాక్‌బ‌స్టర్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌కు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, నరేష్ కామెడీ అమితంగా అలరిస్తుంది. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌’’ అని వెల్లడించారు.

Also Read:

కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. మనోజ్ కుమార్ మావిళ్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.