రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్.. ఐసీయూలో చికిత్స.. ఆసుపత్రి యాజమాన్యం ఏమందంటే!

Share Icons:
ఇటీవలే హీరో కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది ఆసుపత్రి యాజమాన్యం.

ప్రస్తుతం ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై రాజశేఖర్‌కి చికిత్స అందిస్తున్నామని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, డాక్టర్స్ సూచనలకు ఆయన స్పందిస్తున్నారని తాజా బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న జీవితను ఈ రోజు డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వచ్చిన ఈ ప్రకటన చూసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో త్వరగా ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

Also Read:
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, ఆయన కండిషన్ సీరియస్‌గా ఉందని వస్తున్న వార్తలపై శివాత్మిక, జీవిత రియాక్ట్ అయ్యారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాజశేఖర్ మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు. దయచేసి ఫేక్ వార్తలు నమ్మొద్దని వారు విజ్ఞప్తి చేశారు.