రాజనాల చూసి పరుగెత్తిన మహిళలు.. హీరోయిన్‌తో బాధ చెప్పుకున్న విలన్

Share Icons:
పాతతరం సినిమాల్లో విలన్ అంటే మాత్రమే గుర్తుకొచ్చేవారు. త‌న న‌ట‌న‌లో క్రూర‌త్వాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రకే వ‌న్నె తెచ్చారాయన. అయితే రాజనాల సినిమాల్లోలాగానే బయట కూడా అలాగే ఉంటారని చాలామంది అనుకునేవారట. దీంతో ఎక్కడికెళ్లినా కొంతమంది రాజనాలను చూసి పరుగెత్తేసేవారట. ఇలాంటి సంఘటన ఒకటి వ‌ర‌క‌ట్నం(1968) సినిమా సమయంలో జరిగింది.

Also Read:

పశ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లిగూడెం ప్రాంతంలో రోడ్డు మీద అవుట్‌డోర్ షూటింగ్ చేస్తున్నారు. ఖాళీ సమయంలో రాజనాల చెట్ల కింద కూర్చుంటే అభిమానులు ఆయన్న చుట్టుముట్టేవారట. ఓ రోజు హీరోయిన్ కృష్ణకుమారి వద్దకు ఆ ప్రాంతంలోని మహిళలు వచ్చి మాట్లాడుతున్నారట. అదే సమయంలో రాజనాల అటుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన్ని చూసిన మహిళలందరూ ‘అమ్మో రాజ‌నాల‌!’ అంటూ కేకలు వేసుకుంటూ దూరంగా పరుగు తీశారంట.

Also Read:

దీంతో రాజ‌నాల‌, కృష్ణకుమారి వారి అమాయ‌క‌త్వాన్ని చూసి న‌వ్వుకున్నారు. ‘చూశావా కృష్ణా.. విల‌న్ వేషాలు వేసేవాడు బ‌య‌ట కూడా అలాగే ఉంటాడ‌ని అనుకుంటున్నారు. ఈ ఆడ‌వాళ్లంద‌ర్నీ చెర‌బ‌డ‌తానని భయపడి పారిపోయారు. అయితే హీరోల‌కి ఉన్నట్లే మా విల‌న్‌ల‌కీ అభిమానులంటారు. ఎక్కడికైనా వెళ్తే న‌న్నూ క‌ద‌ల‌నీయ‌కుండా చుట్టుముడ‌తారు తెలుసా’ అని కృష్ణకుమారితో అన్నారట రాజ‌నాల‌.