యూట్యూబ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఊచకోత… టీజర్‌తోనే సంచలనాలు

Share Icons:
ఐదారు నెలలుగా ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కు కొమరం భీమ్ టీజర్‌తో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు జక్కన్న. అందులో ఎన్టీఆర్ విన్యాసాలు, ఆయన్ని చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. ఒక హీరోను ఆకాశమంత ఎత్తులో చూపించడంలో తనను మించిన వారెవ్వరూ లేరని రాజమౌళి మరోసారి చూపించాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎన్టీఆర్ విశ్వరూపం, జక్కన్న ఎలివేషన్ షాట్స్, కీరవాణి నేపథ్య సంగీతం, సెంథిల్ కుమార్ కెమెరా పనితనం, రామ్ చరణ్ వాయిస్ ఇలా అన్నీ కలిసి టీజర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. పాత్రకు తగినట్లుగా ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్న తీరు అబ్బుర పరుస్తోంది.

Also Read:

అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ టీజర్‌ ప్రశంసలతో పాటు అంతే స్థాయిలో విమర్శల పాలైంది. కాపీ క్యాట్ అనే ముద్రను ఈ సారి కూడా రాజమౌళి నిరూపించుకున్నాడు. నెటిజన్లు ప్రతి ఒక్క షాట్‌ను జల్లెడ పట్టి దాని స్క్రీన్‌ షాట్స్ తీసి పక్కా ఆధారాలు బయటపెట్టారు. మరోవైపు టీజర్ ఆఖర్లో భీమ్ ముస్లిం వేషధారణలో కనిపించడంతో నెటిజన్లు, తెలంగాణవాదులు ఏకి పారేస్తున్నారు. ఇచ్చి విమర్శలు వస్తున్నా ఆర్ఆర్ఆర్ టీజర్ మాత్రం సోషల్‌మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇన్నాళ్లూ ఆకలి మీద ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొట్టేస్తుండటంతో అత్యంత వేగంగా వన్ మిలియన్ లైకులు సాధించిన టీజర్‌గా రికార్డులకెక్కింది.

Also Read:

ఫాస్టెస్ట్ 100k, 200k, 300k, 400k, 500k, 600k, 700k, 800k, 900k, 1M ఇలా ప్రతీ ఒక్క దాంట్లో ఆర్ఆర్ఆర్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన నిమిషాల్లోనే రాకెట్‌లా ఈ టీజర్ దూసుకుపోయింది. ఇప్పటివరకు 18.19 మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు వన్ మిలియన్ లైకులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.