మొత్తానికి గుట్టు రట్టయింది.. చిరంజీవి గుండు సీక్రెట్ రివీల్.. బాబోయ్! మెగాస్టార్ మ్యాజిక్ చూడండి

Share Icons:
దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో రారాజుగా కీర్తించబడుతున్నారు చిరంజీవి. మెగాస్టార్‌గా కోట్లాది అభిమానుల గుండెల్లో అలా స్థిరపడిపోయిన ఆయన 65 ఏళ్ల వయసులోనూ మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. క్యారెక్టర్‌లో ఒదిగిపోయేందుకు ఎంత రిస్క్ తీసుకుంటారనేది గతంలోనే ఎన్నో సినిమాలతో ప్రూవ్ అయింది. ఇక రీ ఎంట్రీ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త మేకోవర్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన గుండు లుక్ పోస్ట్ చేసి అందరీనీ ఆశ్చర్యపర్చిన చిరంజీవి.. తాజాగా ఆ గుండు గుట్టు బయటపెట్టి మరోసారి ఆకర్షించారు.

అర్బన్ మాంక్ అంటూ గుండు లుక్‌తో పరేషాన్ చేసిన చిరంజీవిని చూసి.. నిజంగానే ఆయన గుండు చేసుకున్నారేమో అని అంతా భావించారు. ఈ లుక్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది కూడా. అయితే అది రియల్ గుండు కాదని, తమ టెక్నీషియన్స్ ఇలా తయారు చేశారని తెలుపుతూ ఆ వీడియోను అందరి ముందుంచారు మెగాస్టార్. ఈ మేరకు తన లుక్‌ వెనకున్న సీక్రెట్‌ను స్వయంగా రివీల్‌ చేశారు. ”నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్” అంటూ పోస్ట్ పెట్టారు చిరంజీవి.

తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న సీక్రెట్ ప్రాస్థటిక్ మేకప్ అనే మొత్తానికి రివీల్ చేసిన చిరు.. ఈ లుక్ కోసం టెక్నీషియన్స్‌కి సహకరిస్తూ గంటల తరబడి అలానే కూర్చున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటిదాకా ఈ గుండు లుక్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ మెహర్ రమేష్ సినిమా కోసం భావించిన ప్రేక్షకులు.. ఈ సీక్రెట్ బయటపడ్డాక ఆయన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసమే కావొచ్చని అంచనాకు వచ్చారు. ఏదేమైనా ఈ వయసులో కూడా మెగాస్టార్ ఇలా మ్యాజిక్స్ చేస్తుండటం ఆయన అభిమాన వర్గాల్లో నూతనోత్సాహం నింపుతోంది.