మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. నాగబాబుకు పాజిటివ్?

Share Icons:
దేశంలో విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీలు, సెలబ్రెటీలు ఇలా ఎవరినీ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఈ కోవలోనే తెలుగు సినీ పరిశ్రమలోనూ చాలామంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మెగాస్టార్ సోదరుడు, నటుడు, నిర్మాత కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా దగ్గు, జర్వం లక్షణాలతో బాధపడుతున్న ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

Also Read:

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇటీవల సినిమా, టీవీ షూటింగులు మొదలయ్యాయి. దీంతో నటీనటులు బిజీగా మారిపోయారు. కోవిడ్-19 నిబంధనలన్నీ పాటిస్తూనే షూటింగుల్లో పాల్గొంటున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతుండటంతో కలవరపరుస్తోంది. తాజగా నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు రావడంతో అందరూ షాకయ్యారు.

  1. Also Read:

నాగబాబు ఓ ప్రముఖ ఛానల్‌లో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆ షోలో పాల్గొన్నవారితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారట. ప్రస్తుతం నాగబాబు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నాగబాబు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.