మియా మాల్కోవా వీడియో పెట్టిన వర్మ.. ఎడారి దొర్లించేసి ‘హువ్వా.. హువ్వా’ మంటలే

Share Icons:
మండే ఎడారిలో మంటలేశాడు వర్మ.. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఉంటే ఉన్నాయ్ లేవంటే లేవు అన్నట్టుగా ఉన్న రెండు గుడ్డముక్కలేయించి ‘ఉవ్వా.. ఉవ్వా’ అంటూ ఎడారి మొత్తం దొర్లించేస్తున్నాడు వర్మ. మియాతో గతంలో గాడ్ సెక్స్ & ట్రూత్ అనే శృంగారభరిత చిత్రాన్ని చెక్కిన వర్మ.. ఇప్పుడు తిరిగి ఆమెతోనే ‘క్లైమాక్స్’ (Climax) అనే కళాఖండాన్ని చిత్రీకరించాడు.

యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశానికి శృంగార సన్నివేశాలు, నగ్న దృశ్యాలు జోడించి ఈ ‘క్లైమాక్’ రూపొందించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, ట్రైలర్స్‌ను వదిలిన వర్మ… తాజాగా ఇందులోని సాంగ్‌ను విడుదల చేశాడు. 3.35 నిమిషాల నిడివితో ఈ ఉన్న ఈ సాంగ్‌లో మియా మాల్కోవాను వివిధ భంగిమల్లో చూపించాడు వర్మ. ఎడారి మంట వేసి ఆమెతో రొమాన్స్ ఓ రేంజ్‌లో చూపించాడు. జస్ట్ డూ ఇట్ ఫ్రీక్ అవుట్ అంటూ సాగిన ఈ పాటలో ‘హువ్వా.. హువ్వా’ అంటూ మాల్కోవా మైమరపించి శృంగార ప్రియులకు నయనానందం కలిగించింది. బర్తీ గుప్తా ఆలపించిన ఈ పాటకు రవి శంకర్ ట్యూన్స్ అందించారు.

దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా ‘క్లైమాక్’ సినిమాను ఆపలేదంటూ.. మే 29వ తేదీన తన ‘క్లైమాక్’ మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వర్మ. ఇక కరోనా వల్ల సినిమా కరువులో ఉన్న నెటిజన్లు వెయిటింగ్ అంటూ క్లైమాక్స్ చిత్రంపై కామెంట్స్ పెడుతున్నారు.