సమీచీన సమీకరణాల సమగ్ర సమాచార వేదిక “మామాట అంతర్జాల వార్తా సమాహారం”. ఎన్నో అంతర్జాల వార్తా సంచికలు, వేటి విభిన్నత వాటిది, అయితే అనుకరణలకు, మూస పోకడలకు భిన్నంగా దైనందిన సమాచారంతో పాటు సాహితీ ప్రియులకు చేత వెన్నముద్దలు, రసాభిలాషులకు చెంగల్వ పూదండలు, అక్షరరూపంలో మీకందించి అలరిస్తుంది మామాట.

స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు విశేషాలతో పాటు, సమకాలీన రాజకీయాలు, సామాజిక సంబంధమైన విషయాలు, ముఖ్యసంఘటనల గురించి విశ్లేషణాత్మక సంపాదకీయాలను అందించడంతో పాటు, మరుగునపడ్డ ఘటనల పూర్వాపరాలను (కేస్ ఫాలో-అప్స్) తిరగతోడుతుంది మామాట. ఏ రాజకీయ పార్టీలకు, సామాజికవర్గాలకూ, మతాలకు, ప్రాంతాలకూ పరిమితం కాకుండా, స్వతంత్ర ప్రతిపత్తితో, ప్రజాస్వామ్యానికి, పౌరులకు బాసటగా, పరిపాలిస్తున్నది ఏ రాజకీయ పార్టీ అయినా నిష్పక్షపాతంగా ప్రశ్నించడానికి, విమర్శించడానికి వెనుకాడదు మామాట. జనసామాన్యానికి వెన్నుదన్నుగా నిలిచి రాజ్యాంగ స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు నిరంతరం అక్షర పోరాటం చేస్తుంది మామాట.

అక్షరం శీర్షికన వివిధ అంశాలపైన, సాహిత్యంపైన వ్యాసాలను అంతర్జాల వీక్షకులకు, సాహిత్యాభిమానులకు పసందుగా అందిస్తుంది మామాట. పేరుప్రఖ్యాతులు, బిరుదులతో సంబంధం లేకుండా చక్కగా రాయగల నేర్పు, సొంపైన భావప్రవాహం కలిగి, ఉత్సాహవంతులైన రచయితలను, ఏ రకమైన భేదభావాలు లేకుండా అక్కున చేర్చుకుంటుంది మామాట అక్షరం శీర్షిక.

ఆవరణం శీర్షికన గృహావరణం పేరుతో ఇల్లు, ఇంటి వాతావరణం, పరిసరాలకు సంబంధించిన అంశాలపై చక్కటి వ్యాసాలను, పర్యావరణం పేరుతో ప్రకృతికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ ఆసక్తికరమైన విషయాలను, అంతరావరణం పేరుతో మానసిక ఆరోగ్యం, పరివర్తన, పరిణామము, ఆధ్యాత్మికతను గురించిన అంశాలను గూర్చి శాస్త్రీయ విషయాలను అందిస్తుంది మామాట.

విలువైన ఆరోగ్య సూత్రాలను, వివిధ ఆధునిక వైద్య విధానాలను, ప్రత్యేక చికిత్సలను గూర్చిన విషయాలను, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన భారతీయ వైద్యవిధానమైన ఆయుర్వేదానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను వీక్షకులకు అందిస్తుంది మామాట.

వినోదం మరియు క్రీడలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు అంతర్జాల చదువరులకు అందిస్తూ రంజింపజేస్తుంది మామాట. తెర కబుర్లు పేరుతో టీవీ మరియు చలనచిత్ర విశేషాలు, కళా రంగాలు పేరుతో ప్రాచీన, ఆధునిక కళల గురించిన విశేషాలు, ఇంకా హాస్య, చమత్కార, వ్యంగ్య చిత్ర వైభవాలను చదువరులకు అందిస్తుంది మామాట.

ఇతర రంగాల విషయానికి వస్తే విద్యారంగం మరియు ఉపాధి రంగానికి సంబంధించి వివిధరకాలైన కోర్సులు, వాటి వివరాలు, ఉపాధి మార్గాలు, వాటికి కావలసిన నైపుణ్యాల గురించి ఎన్నో వార్తలను, విశ్లేషణాత్మక అంశాలను చదువరుల చెంతకు తెస్తుంది మామాట. వ్యవసాయం, వ్యవసాయానుబంధాలు, పల్లె-పనిముట్లు మరియు పెరటి తోటలు శీర్షికల కింద సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, వివిధ రకాలైన పంటలు, విధానాలు, పండ్ల తోటలు, అంతర్జాతీయంగా వ్యవసాయానికి సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, సేంద్రీయ ఎరువులు మొదలైనవాటిగురించిన సమాచారాన్ని అందరికీ చేరవేస్తుంది మామాట.

వాణిజ్యం శీర్షికన ఆయా రంగాలకు సంబంధించిన తాజా వార్తలు విశేషాలతో పాటు, పరిశ్రమలకు, సాంకేతిక రంగానికి చెందిన సరికొత్త ఆవిష్కరణలను, పరిశోధక విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది మామాట. ఫోటో మరియు వీడియో కథనాలు మామాటలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.