‘‘మాజీ భర్తపై ప్రేముంది.. కానీ కలిసి ఉండలేను’’

Share Icons:
బాలీవుడ్ నటి పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదనే అనుకోవాలి. ఎందుకంటే ఆమె తనకంటే పెద్దవాడైన, ఆల్రెడీ పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయారు. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. అతన్ని పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. రేపో మాపో బిడ్డకు జన్మనిస్తారు. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా మంది కల్కిపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇవన్నీ ఆమె పట్టించుకోలేదు. అయితే తన మాజీ భర్త గురించి కల్కి ఓ సందర్భంలో స్పందించారు.

‘నా మాజీ భర్త అనురాగ్ కశ్యప్ అంటే నాకు ఇప్పటికీ ప్రేమ ఉంది. కానీ అతనితో కలిసి ఉండలేను. మేమిద్దరం విడిపోకముందు చాలా ఆలోచించుకున్నాం. అయితే ఇప్పటికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. అదీకాకుండా మా ఇద్దరికీ టైమింగ్ కుదరలేదు. మా ఇద్దరి బంధం వివిధ టైం జోన్స్‌లా ఉండేది. అతను నాకంటే వయసులో చాలా పెద్దవాడు. దాంతో ఇద్దరికీ కుదరలేదు. మేమిద్దరం విడిపోవాలని అనుకున్నప్పుడు మా అభిప్రాయాలు వేరు. అందుకే విడిపోవడమే మంచిది అనిపించింది’ అని తెలిపారు.

READ ALSO:

ఇంతకీ ఆమె మాజీ భర్త ఎవరంటే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్. ఇతను రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘అంజలి సీబీఐ’ సినిమాలో విలన్ పాత్రలోనూ నటించారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేయటం ఇతనికి అలవాటు. అందుకే చాలా మందికి అనురాగ్ అంటే ఇండస్ట్రీలో పడదని టాక్.

READ ALSO: