మహేష్ సినిమాలో భాగమవుతున్న నమ్రత! అభిమానుల్లో జోష్ నింపేలా డేరింగ్ స్టెప్..

Share Icons:
‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ పరుశురాం సినిమా ఓకే చేసిన ఆయన.. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. మే 31న పూజా కార్యక్రమాలు నిర్వహించి అఫీషియల్‌గా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే సినిమా ప్రొడక్షన్స్‌లో భాగమవుతున్న మహేష్ సతీమణి పరశురాం సినిమా లోనూ భాగం కానుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు మహేష్ బాబు సైతం ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ క్రమంలో మహేష్ చేప్పట్టనున్న నిర్మాణ బాధ్యతలు స్వయంగా నమ్రతనే చేసుకునేలా ప్రణాళిక రంచించారని టాక్. ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని బాధ్యతలను నమ్రత దగ్గరుండి చూసుకోబోతున్నారని తెలుస్తోంది.

Also Read:
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. తన సతీమణి నమ్రత సహకారంతో వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జీఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టీప్లెక్స్ ప్రారంభించిన ఈ సూపర్ జోడీ.. ‘జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ కూడా ఇటీవలే ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా రూపొందిస్తున్నారు. శ‌శికిర‌ణ్ తిక్క రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రొడక్షన్ పనులను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ స్వయంగా చూసుకుంటున్నారు . ఆ అనుభవంతోనే పరశురాం సినిమాను డీల్ చేయబోతున్నారని సమాచారం. ఏదేమైనా మహేష్ సినిమాలో నమ్రత భాగం కానుందనే న్యూస్ సూపర్ స్టార్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.