మహేష్ బాబు పాటతో మ్యాజిక్ చేసిన స్టార్ క్రికెటర్.. రియల్లీ మైండ్ బ్లాక్! వీడియో వైరల్

Share Icons:
ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన.. తెలుగు సినిమా పాటలకు డాన్సులేస్తూ ఫిదా చేస్తున్నారు. తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని ”బుట్ట బొమ్మ” పాటకు డాన్స్ చేసి ఆకర్షించిన డేవిడ్ వార్నర్ తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ వ్యాఖ్యకు సంబంధించిన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.

‘ఇంట్లో షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే’ బై బై చెప్పేశా అని పేర్కొంటూ ట్వీట్ చేశారు వార్నర్. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఆ వీడియోలో బ్యాటింగ్ చేస్తూనే అలా మాయమైపోవడం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీప్ ఇట్ అప్ డేవిడ్ వార్నర్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.